Share News

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: శంకర్‌

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:31 PM

మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేం దుకు చేపల ఉత్పత్తులపై ఇస్తున్న శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు.

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: శంకర్‌
గార: మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

గార, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునేం దుకు చేపల ఉత్పత్తులపై ఇస్తున్న శిక్షణను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. మొగదాలపాడులో రాష్ట్ర పేదరిక నిర్మూ లన సంస్థ, డీఆర్‌డీఏ, నాబార్డు సంయుక్త ఆధ్వ ర్యంలో ఎస్‌హెచ్‌జీ మహిళలకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థి కంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ శిక్షణను నిర్వహిస్తున్నాయన్నారు. శిక్షణ అనంతరం నాబార్డు సహకారంతో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాబార్డు డీడీఎం రమేష్‌కృష్ణ, డీఆర్‌డీఏ, వెలుగు అధికారులు, మండల మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

వైద్య శిబిరాలను వినియోగించుకోండి

అరసవల్లి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఉచితంగా నిర్వహి స్తున్న వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్‌ కోరారు. మంగళవారం బలగ ప్రాం తంలో కిమ్స్‌, జెమ్స్‌ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రకాల వ్యాధుల నిర్థారణకు శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కూటమి నాయ కులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:31 PM