‘పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి’
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:27 AM
మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
లావేరు, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మండలం లో ఇటీవల అకాల వర్షాలు, గాలులకు పంటలు నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. బుడుమూరులో అకాల వర్షానికి నష్టపోయిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలిం చారు. ఇటీవల ఈదురుగాలులకు వందల ఎకరా ల్లో మొక్కజొన్న, అరటి, నువ్వు, మిరప తదితర పంటలు తీవ్రంగా నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్ట పోయిన మొక్క జొన్న పంట ఎకరానికి రూ.50 వేలు, మిరప పంటకు రూ.లక్ష చొప్పున పంట నష్ట పరిహారం చెల్లిం చాలని కోరారు.
కొబ్బరి, టమాటా పంటల పరిశీలన
కంచిలి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బూరగాం, కుత్తుమ, అమ్మవారిపుట్టుగ, కొక్కిలిపుట్టుగ తదితర గ్రామాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న కొబ్బరి, టమాటా పంటలను ఉద్యానవన శాఖాధికారి పి.మాధవీలత బుధవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మండల పరిధిలో 130 కొబ్బరి చెట్లు నేలకు ఒరిగినట్లు గుర్తించామని, టమాటా పంట సాగుచేస్తున్న 55 మంది రైతులకు చెందిన 63 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంప నున్నామన్నారు. పంట నీటిలో ఉన్న టమాటా రైతులు బిల్టాక్స్ కాని కాపర్ ఆక్సీక్లోరైడ్‌ని కాని లీటరు నీటిలో మూడు గ్రాములు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పండిన పండ్లను వీలైనంత తొందరగా కోసివేయాలన్నారు.