రీసర్వేకు సహకరించాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:42 PM
:భూముల రీసర్వేకు రైతులు తమ పొలంవద్దకు పాస్‌పుస్తకాలు లేదా భూముల వివరాలతో వచ్చి సహకరించాలని రీసర్వే విభాగ డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి కోరారు.
పోలాకి, జనవరి 1(ఆంధ్రజ్యోతి):భూముల రీసర్వేకు రైతులు తమ పొలంవద్దకు పాస్‌పుస్తకాలు లేదా భూముల వివరాలతో వచ్చి సహకరించాలని రీసర్వే విభాగ డిప్యూటీ తహసీల్దార్ గాయత్రి కోరారు. గురువారం దీర్గాసిలో రీసర్వే అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో విడతగా మబగాం, అంపలాం, దీర్గాశి గ్రామాల్లో రీసర్వే ప్రారంభిస్తున్నామని చెప్పారు. దీర్గాశి మబగాం, అంపలాం గ్రామాల రైతులతో సచివాలయంలో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించామని చెప్పారు. రైతులు తమ ఆఽధీనంలోనే కాకుండా హక్కులు ఉన్న పాతదస్తావేజులు, పారీకత్తులు ఉన్నా తీసుకువచ్చి భూవిస్తీర్ణాన్ని తెలియచేస్తే రికార్డుల ప్రాప్తికి సర్వే నిర్వహిస్తామని తెలిపారు.రీసర్వే అనంతరం ఎలాంటి చేర్పులు మార్పులు జరగవని చెప్పా రు. దీర్గాశి, అంపలాం, మబగాం రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాల రైతులు తమకు అందుబాటులో ఉండాలని కోరారు. రైతులు తమ భూముల వివరాలను స్థానిక వీఆర్వో, సర్వేయర్‌కు చూపించి విస్తీర్ణాలు, యజమానుల పేర్లను సరిచేసుకోవాలన్నారు. రీసర్వే అనంతరం పట్టాదార్ పాస్ పుస్తకాలను యజమాని పేరుతో అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో బోర జగన్నాఽథం, సర్వేయర్ గొల్లంగిరామకృష్ణ, మాజీ సర్పంచ్ పల్లిసూరిబాబు, ఎంపీటీసీమాజీ సభ్యులు, ఉపాధి హామీ క్షేత్రసహాయకులు పాల్గొన్నారు.