శ్రీకాకుళం అభివృద్ధికి సహకరించాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:20 AM
శ్రీకాకుళం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు వినతిపత్రం అందించారు.
శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలకు ప్రత్యేక నిధులు
కళింగపట్నం-పార్వతీపురం మార్గానికి ఎన్‌హెచ్-5 హోదా
కేంద్రమంత్రి సమక్షంలో ఉపరాష్ట్రపతికి ఎమ్మెల్యే గొండు శంకర్ వినతి
అరసవల్లి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు సోమవారం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్వగృహంలో ఉప రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే నియో జకవర్గానికి సంబంధించిన మూడు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోండి
చారిత్రక ప్రసిద్ధి కలిగిన శ్రీకూర్మనాథ స్వామి ఆలయ సమగ్రాభిమృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దేశం లోనే కూర్మావతారానికి ఏకైక, అరుదైన ఆలయంగా దీనికి విశేష ప్రాముఖ్యత ఉందని, అయితే మౌలిక సదుపా యాల లేమితో భక్తులు ఇబ్బందులు పడుతున్నా రని వివరించారు. ఆలయ ప్రాచీన వైభవాన్ని కాపాడు తూనే, వసతి, పారిశుధ్యం, రవాణా సౌకర్యాలను మెరుగుపరి చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించా లన్నా రు. అలాగే అరసవల్లి సూర్య నారాయణ స్వామి వారి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ పథకంలో చేర్చా లని విజ్ఞప్తి చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పెం డింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వేగవంతంగా ఆమో దించి, పనులు ప్రారంభించేలా చూడాలన్నారు.
ఎన్‌హచ్-5గా కళింగపట్నం-పార్వతీపురం మార్గం
కళింగపట్నం,-పార్వతీపురం మార్గాన్ని నాలుగు లేన్ల మార్గంగా విస్తరించి జాతీయ రహదారిగా ప్రకటించాలని ఉపరాష్ట్రపతిని కోరారు.
ఒడిశా రాష్ట్రాన్ని అనుసంధానించే ఈ కీలక మార్గం లో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుందని, తరచూ ప్రమా దాలు సంభవిస్తున్నాయని వివరించారు. యాత్రికులు, స్థానిక ప్రజల భద్రత, ప్రయాణ సౌల భ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ రహదారి విస్తరణ, ఎన్‌హెచ్-5 హోదా ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తక్ష ణమే ఆమోదిం చేలా చొరవ చూపాలని ఉప రాష్ట్రపతికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.