జనగణనలో భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:22 AM
census starting దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణన ప్రక్రిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. గురువారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో జనగణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీయగణన ప్రక్రియను మంత్రి ప్రారంభించారు. హెచ్‌టీటీపీఎస్:// ఎస్‌సీ.సీఈఎన్‌ఎస్‌యుఎస్. జీఓవీ.ఐఎన్ పోర్టల్ ద్వారా ఆయన తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంటి నుంచే సులువుగా వివరాలు నమోదు చేసుకునే ఈ వెసులుబాటును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జిల్లావ్యాప్తంగా ఈ నెల 30వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా ప్రజలకు ఈ ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భవానీపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.