విజయమే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:49 PM
రానున్న మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం అర్బన్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. బుధవారం శ్రీకాకుళంలోని విశాఖ-ఏ కాలనీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా వారిని గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. నాయకులు మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురా వాలని సూచించారు. పార్టీ పరిశీలకుడు మహ్మద్‌నజీర్, జిల్లా అధ్యక్షుడు మొదల వలస రమేష్, ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటించి సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కోవాలని కోరారు.