Share News

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 11:57 PM

స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ గెలు పే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మె ల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

 టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కవిటి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ గెలు పే లక్ష్యంగా కృషి చేయాలని ఎమ్మె ల్యే బెందాళం అశోక్‌ అన్నారు. రామ య్యపుట్టుగ క్యాంపు కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ నేతలు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, మండల నాయ కులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సం స్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ క్యాడర్‌ సిద్ధంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లను ప్రజలకు వివరించాలని, అలాగే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చే యాలని సూచించారు. సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో పరిశీలన చేయాలని కోరారు. ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టేలా ఉండాలని సూచించారు. సమావేశంలో నేతలు మణి చంద్రప్రకాష్‌, బి.చిన్నబాబు, పి. కృష్ణారావు, బి.రమేష్‌, సంతోష్‌ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 11:57 PM