వెట్టిచాకిరీ నిర్మూలనకు కలిసి పనిచేయాలి
ABN , Publish Date - Mar 07 , 2026 | 11:58 PM
జిల్లాలో వెట్టి చాకిరీ నిర్మూలించేందుకు అందరం కలిసి పని చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె.హరిబాబు అన్నారు.
శ్రీకాకుళం లీగల్, ఫిబ్రవరి 26 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో వెట్టి చాకిరీ నిర్మూలించేందుకు అందరం కలిసి పని చేద్దామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్య దర్శి కె.హరిబాబు అన్నారు. శనివారం అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో స్థానిక న్యాయసేవా సదన్ కార్యాలయంలో అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం 1976లోనే చేసినప్పటికీ ఇప్పటికీ అనేక మంది కార్మికులు వెట్టిచాకి రీకి గురవుతు న్నారన్నారు. వెట్టిచాకిరీ చేయించుకునే యజమానులకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా ఉంటుందన్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో చైతన్యం చేసేందుకు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భాగస్వా ములు కావాలన్నారు. కార్యక్ర మంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ అజయ్, తహసీల్దార్ గణపతి, బి.గోపాల రావు, ఎస్.కిరణ్ కుమార్, నేచర్ సంస్థ ప్రతినిఽధులు జీకే దుర్గ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు అండగా న్యాయవ్యవస్థ: కిశోర్‌బాబు
సోంపేట, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలకు న్యాయపరంగా ఎటువంటి అవసరం ఉన్నా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఆరో అదనపు జిల్లా న్యాయాదికారి కోడూరు కిశోర్‌బాబు తెలిపారు. కంచిలి పట్టణంలోని పలు వ్యాపార సంస్థల్లో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా మహిళలతో మాట్లా డుతూ.. పనికాలం, సకా లంలో వేతనం అందుతున్నాయా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీఎస్ శైలీంద్ర, కంచిలి ఎస్‌ఐ పి.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: జ్యోత్స్న
పొందూరు, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించినపుడే సమాజంలో గౌరవం పొందుతారని పొందూరు జూనియర్ సివిల్ న్యాయాధికారి బి.జ్యోత్స్న అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటుక బట్టీలలో పని చేస్తున్న మహిళలను పలుకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పురుషులతో సమానంగా మహిళలకు గౌరవం దక్కాలని ఆకాంక్షించారు. కార్యక్ర మంలో న్యాయవాది రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బాలలను పనిలో పెడితే కేసులు: ఫరీష్‌కుమార్
ఇచ్ఛాపురం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): బాలలను పనిలో పెడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ న్యాయాధికారి ఫరీష్ కుమార్ హెచ్చరించారు. ఈదుపురం రోడ్డులోని ఇటుకల పరిశ్రమను శనివారం తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి రోజువారి భృతి అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బడికి పంపించాలని, లేకుంటే చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. 18 ఏళ్లలోపు పిల్లలను పనిలోకి తీసుకుం టే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌ఐ ముకుందరావు, ప్యానల్ అడ్వకేట్లు సోమశేఖర్‌రెడ్డి, సీతయ్య రెడ్డి, రమణయ్యరెడ్డి, దివాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం: రమ్య
ఆమదాలవలస, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని జూనియర్ సివిల్ న్యాయాధికారి బి.రమ్య అన్నారు. శనివారం పట్టణంలోని మెట్టక్కివలస మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే చట్టాల గురించి తెలుసుకోవడం అవసరమన్నారు. విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి భారతీయ సంస్కృతిని కాపాడాలన్నారు. కార్యక్ర మంలో ఏజీపీ పైడి వరహా నరసింహులు, బార్ అసోసియేషన్ ఽఅధ్యక్షుడు అన్నెపు సత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు బొడ్డేపల్లి మోహన్‌రావు, తమ్మినేని అన్నంనాయుడు, సీపాన గోవిందరావు పాల్గొన్నారు.