ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా పాటుపడాలి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:08 AM
తూర్పు కాపు సామాజికవర్గ ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని తూర్పుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సురంగి మోహనరావు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నాయుడు కోరారు.
తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలు
అరసవల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తూర్పు కాపు సామాజికవర్గ ఐక్యత, అభివృద్ధే లక్ష్యంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని తూర్పుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు సురంగి మోహనరావు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణం నాయుడు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడు తూ.. ఉత్తరాంధ్రలో సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రగతిని సాధిం చేందుకు ముందుకు సాగుదామన్నారు. ఈనెల 14న నగరంలోని ఆదివారం పేట వద్ద ఉన్న ఓ పైవేటు కల్యాణ మండపంలో ‘తూర్పుకాపుల ఆత్మగౌరవ సమ్మేళనం’ నిర్వహి స్తున్నామని, సామాజికవర్గమంతా తరలిరావాల ని కోరారు. ఈ సమ్మేళనంలో రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో అవకాశాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్ర మంలో ఉద్యోగ సంఘాల నేత కిలారి నారాయణ రావు, జోగినాయుడు, పాండ్రంకి రమేష్‌నాయుడు, ఎం.రామజోగి నాయుడు, రాడ కైలాసరావు, డోల వంశీ బాలకృష్ణ, ఓళ్ల శ్రీరాములునాయుడు, చండక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.