ఎర్రన్న ఆశయసాధనకు పాటుపడాలి
ABN , Publish Date - Nov 03 , 2026 | 12:01 AM
దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు ఆశయసాధనకు పాటుపడాలని టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
దివంగత కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రంనాయుడు ఆశయసాధనకు పాటుపడాలని టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎర్రంనాయుడు వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ బలోపేతానికి, జిల్లా పురోగతికి ఆయనచేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయసాధన కసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. - (ఆంధ్రజ్యోతి బృందం)