Share News

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 11:35 PM

స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష టీడీపీ నాయకులకు పిలుపు నిచ్చారు.

స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలి
పలాసలో ముఖ్యనేతలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

- ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని ఎమ్మెల్యే గౌతు శిరీష టీడీపీ నాయకులకు పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్యనాయకులు, క్లస్టర్‌ ఇన్‌చార్జిలు, మండల, మున్సిపల్‌ నాయకులతో సమావేశం నిర్వహించారు. శిరీష మాట్లాడుతూ.. ప్రతి గ్రామం, వార్డు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు వారికి సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించాలన్నా రు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచి చర్యలు ప్రారంభించాలని అన్నారు. సమావే శంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, పీరుకట్ల విఠల్‌రావు, గాలి కృష్ణారావు, సప్ప నవీన్‌, గురిటి సూర్యనారాయణ, సూ రాడ మోహనరావు, దాసరి తాతారావు, మల్లా శ్రీనివాస్‌, యవ్వారి మోహనరావు పాల్గొన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

హరిపురం, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షే మమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మందస మండలం సరియాపల్లి గ్రా మంలో మంగళవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, తాగునీరు, విద్య, వైద్యం, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలపై ఏవైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పీరుకట్ల విఠల్‌, ఏఎంసీ ఛైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు బావన దుర్యోధన, నాయ కులు రట్టి లింగరాజు, కొర్ల కన్నారావు, ముంజేటి చంద్ర శేఖర్‌, లబ్బ రుద్రయ్య, ఈశ్వరరావు, బమ్మిడి కర్రయ్య హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 11:35 PM