Share News

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:08 AM

సాంకేతికలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు.

సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
విద్యార్థులతో మాట్లాడుతున్న విశాఖ ఎంపీ భరత్‌

విశాఖ ఎంపీ భరత్‌

ఎచ్చెర్ల, జూలై 16 (ఆంధ్రజ్యోతి): సాంకేతికలో వస్తున్న మార్పులను విద్యార్థులు అందిపుచ్చకోవాలని విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. ఎస్‌ఎంపురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ను గురువారం ఆయన సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకించి నిర్వహిస్తున్న ఈ క్యాంపస్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్టు చెప్పారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, క్యాంపస్‌ అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో చర్చించారు. ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్‌ లక్ష్మీనారాయణరావు మాట్లాడుతూ.. ఎంపీ భరత్‌ తన సొంత నిధులు కోటి రూపాయలతో విద్యార్థులకు అవసరమైన ఫర్నీచర్‌ను అందించడం అభినందనీయమన్నారు. ఆడిటోరియంకు కుర్చీలు, డైనింగ్‌ టేబుల్స్‌, తరగతి గదిలో బెంచీలు సమకూర్చారని చెప్పారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.అమరేంద్రకుమార్‌, క్యాంపస్‌ డైరక్టర్‌ ఎం.గిరిధర్‌, ఏవో శివరామకృష్ణ, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ వాసు, ముని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:08 AM