Share News

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగస్వామ్యం కావాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 11:37 PM

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు.

‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’లో భాగస్వామ్యం కావాలి
చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

రణస్థలం, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. మండలంలోని మండలంలోని 34 పంచాయతీ లకు మంజూరైన చెత్త సేకరణ రిక్షాలను మంగళవారం ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణం లో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ.. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛగ్రామంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది సహకరించాలన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామలరావు, డీజీఎం ఆనందరావు, పిసిని జగన్నాఽథంనాయుడు, దన్నాన చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 11:37 PM