Share News

హైవే విస్తరణలో ఇళ్లు కోల్పోయాం..

ABN , Publish Date - May 05 , 2026 | 12:03 AM

జాతీయ రహదారి విస్తరణలో మా విలువైన భూములను కోల్పోయామని, అయితే వారం రోజుల కిందట ఇళ్లు ఖాళీ చేయాలని ఇళ్లలో ఎవరూ లేని సమయంలో గోడలకు నోటీసులను అంటించారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.

 హైవే విస్తరణలో ఇళ్లు కోల్పోయాం..
బుడుమూరు పాత ఎస్సీ కాలనీలో నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబ సభ్యులు

న్యాయం చేయాలంటూ బాధితుల ఆందోళన

లావేరు, మే 4 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి విస్తరణలో మా విలువైన భూములను కోల్పోయామని, అయితే వారం రోజుల కిందట ఇళ్లు ఖాళీ చేయాలని ఇళ్లలో ఎవరూ లేని సమయంలో గోడలకు నోటీసులను అంటించారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు సోమవారం బుడుమూరు ఎస్సీ కాలనీకి చెందిన జరజాన అప్పన్న, దుంగ బావాజీ, కుప్పిలి రమణమ్మ, మన్యాన నాగ రాజు, మన్యాన అసిరమ్మ తదితరులు నోటీసులను చూపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తామంతా నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన వారమని, 2005లో బుడుమూరు వద్ద జాతీయ రహదారి పనులు చేపట్టగా ఆ సమయంలో ఇళ్లు కోల్పోయిన కొందరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించిందని, అయితే మా ఐదు కుటుంబాలకు అప్పట్లో ఎటువంటి పరిహారం చెల్లించలేదని వారు వాపోయారు. రోజు పనులు చేసు కుంటే కాని కుటుంబాలను పోషిం చుకునే పరిస్థితి లేదని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు మేము వ్యతి రేకం కాదని, ప్రభుత్వం, అధికారులు స్పందించి మాకు నష్టపరి హారం ఇవ్వడంతో పాటు గ్రామంలో వేరే చోట ఇళ్ల స్థలాలు ఇప్పించి ఆదుకోవాలని వారు కోరారు.

Updated Date - May 05 , 2026 | 12:03 AM