చరిత్రను తిరగరాశాం
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:22 AM
ఇచ్ఛా పురం మున్సిపాలిటీలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూటమి జెండా ఎగురవేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడా రు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్
ఇచ్ఛాపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛా పురం మున్సిపాలిటీలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూటమి జెండా ఎగురవేశామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహిం చిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడా రు. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఇచ్ఛాపురాన్ని ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చుదిద్దటమే తన లక్ష్యమని అ న్నారు. తన చిరకాల కోరిక నెరవేరిందని ప్రజలకు అభివృద్ధి రూపంలో కానుక అందజేస్తానని తెలిపా రు. ముఖ్యంగా పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను ఆరు నెలల్లో పరిష్కరించి చూపిస్తానని తెలిపారు. ఇచ్ఛాపురం డైలీ మార్కెట్‌ను మోడల్‌గా తీర్చి అభివృద్ది చేస్తానని, ఇందుకోసోం ఇప్పటికే రూ1.75కోట్లు మంజూరు చేసినట్టు స్పష్టం చేశారు. ఎన్నికల ముగిసినంత వరకే పార్టీలు. తరువాత అన్ని ఒక్కటే అని.. పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.