ప్రతీ హామీని నెరవేర్చాం: ఎన్ఈఆర్
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:55 PM
న్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.
రణస్థలం, అక్టో బరు 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని ఎమ్మె ల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. రణ స్థలం, జేఆర్పురం పంచాయతీలో రూ.3 కోట్ల ఖర్చుతో నిర్మించిన సీసీ రోడ్లను బుధవారం ప్రారంభించారు. చేపట్టిన సీసీ రోడ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. జేఆర్పురం వెంకటేశ్వర కాలనీలో రూ.కోటి, లక్ష్మీనగర్లోరూ.75 లక్షలు, సీతంవలస, పిట్టపాలేం గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కార్యక్రమం లో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, పిన్నింటి భానోజినాయుడు దెయ్యం శ్రీనివాసరావు, దమ్ము శ్రీను, నారాయణశెట్టి శ్రీనివాసరావు తదిత రులు పాల్గొన్నారు.