రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం: ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Aug 03 , 2026 | 12:12 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.
రణస్థలం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఎంతో ప్రగతి సాధించామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. రణస్థలంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ.. సీఎం చంద్రబాబు నాయు డు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ పారదర్శకమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం కావడం ఓ చారిత్రాత్మక విజయమన్నారు. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కళిం గ కార్పొరేషన్ డైరెక్టర్ అన్నెపు భువనేశ్వరరావు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ గుజరాపు రాము, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు లంక శ్యామ్, ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, కుమరాపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పిన్నింటిపేట గ్రామంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్ల కూట మి పాలన పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతిని, సంక్షేమాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.