నది చెంతనే నీటి కష్టాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:58 PM
మండలంలోని దబ్బపాడు వంశధారనది చెంతనే ఉన్నా గ్రామస్థులకు తాగు నీటికష్టాలు తప్పడం లేదు. ఇక్కడ రక్షిత మంచి నీటి పఽథకం తరచూ పాడవుతోంది. ఈనేపథ్యంలో దబ్బ పాడు గ్రామస్థులు చెలమల నీటిపైనే ఆధారపడుతు న్నారు.
ఎల్‌ఎన్ పేట, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని దబ్బపాడు వంశధారనది చెంతనే ఉన్నా గ్రామస్థులకు తాగు నీటికష్టాలు తప్పడం లేదు. ఇక్కడ రక్షిత మంచి నీటి పఽథకం తరచూ పాడవుతోంది. ఈనేపథ్యంలో దబ్బ పాడు గ్రామస్థులు చెలమల నీటిపైనే ఆధారపడుతు న్నారు. లక్ష్మీనర్సుపేటలో ఏర్పాటుచేసిన మెగా రక్షిత నీటిపఽథకం ద్వారా తాగు నీరందించేందుకు పైపులైన్ ఏ ర్పాటుచేశారు. ఆ పైపులైన్ నుంచి ఎప్పటికప్పుడు అంత రాయం కలుగుతుండడంతో నీటిసరఫరా నిలిచిపోతోంది. అయితే అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో మె గారక్షిత పఽథకం ద్వారా నీరందని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో సైతం వంశధారనదిలో చెలమ లల్లో నీటిని తీసుకొచ్చి శుద్ధిచేసుకోవల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. గ్రామంలో బోర్లు ఉన్నా తాగడానికి, వంట వినియోగానికి ఉపయోగపడడంలేదు. వంశధార నదికి వరదలు వచ్చే సమయంలో వచ్చే అధికారులు, ఎన్నికల సమయంలో వచ్చే వివిద పార్టీల నాయకులు తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని వాగ్దానం చేసి వెళ్లిపోతున్నా రని పలువురు చెబుతున్నారు. కాగా లక్ష్మీనర్సుపేటలో ఏర్పాటుచేసిన మెగారక్షిత మంచినీటి పఽథకం ద్వారా నీటి గ్రామాలకు సరఫరా జరుగుతున్న పైపులైన్‌కు మరమ్మ తులు చేపట్టి తాగునీరందించేందుకు చర్యలు చేపట్టను న్నట్లు ఎంపీడీవో పి.శ్రీనివాసరావు తెలిపారు.