Share News

రెండు పూటలా నీరివ్వండి

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:37 PM

పట్టణంలోని వజ్రంపేట, నక్కవీధి, దేశవానిపేట, శివనగర్‌కాలనీ తదితర వీధుల్లో కొన్నాళ్లుగా తాగునీరు సరిగా కుళాయిల ద్వారా రాక ఇబ్బంది పడుతున్నామని వజ్రంపేటకు చెందిన మహిళలు వాపోయారు.

రెండు పూటలా నీరివ్వండి
ద్రాక్షాయిణికి తాగునీటి సమస్యను వివరిస్తున్న మహిళలు

నరసన్నపేట, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వజ్రంపేట, నక్కవీధి, దేశవానిపేట, శివనగర్‌కాలనీ తదితర వీధుల్లో కొన్నాళ్లుగా తాగునీరు సరిగా కుళాయిల ద్వారా రాక ఇబ్బంది పడుతున్నామని వజ్రంపేటకు చెందిన మహిళలు వాపోయారు. గతంలో మాదిరిగా రోజుకు రెండుపూటలు కుళాయిల ద్వారా తాగునీరు పంపిణీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఈవో పి.ద్రాక్షాయిణి వద్ద తాగునీరు కొనుగోలు చేస్తున్నామని, వాడుకుల కోసం ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. శివానగర్‌కాలనీ, దేశవానిపేట, వజ్రంపేట, పసారువీధి తదితర కాలనీలకు పూర్తిస్థాయిలో తాగు నీరందించేందుకు రక్షిత మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయని, అంతవరకు ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తామని ఈవో చెప్పారు. కార్యక్రమంలో నక్కవీధి, వజ్రంపేట వీధుల మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:37 PM