Share News

నీటి వనరులను సంరక్షించుకోవాలి

ABN , Publish Date - Apr 18 , 2026 | 11:49 PM

గ్రామ స్థాయి నుంచే నీటివనరులను సంరక్షించుకోవాల్సి న బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు.

నీటి వనరులను సంరక్షించుకోవాలి
కేజీబీవీ పాఠశాలలో భోజనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • దబ్బపాడు పాఠశాల, ఎల్‌ఎన్‌ పేట కేజీబీవీ సందర్శన

ఎల్‌ఎన్‌ పేట, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచే నీటివనరులను సంరక్షించుకోవాల్సి న బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే మా మిడి గోవిందరావు అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని తురకపేట-కృష్ణాపురం గ్రామ పంచాయతీ పరిధి లోని అసర్లవాని చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. గ్రా మాల్లో ఉన్న నీటివనరులను సంరక్షించుకోవడంతో పాటు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తాగు నీటికి ఇబ్బందిపడుతున్నట్టు తురకపేట గ్రామస్థు లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. రెండు మూ డు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దబ్బపాడు గ్రామంలో ని ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన బడిపిలుస్తోంది కార్య క్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. విద్యా ర్థులకు అం దుతున్న సౌకర్యాలపై ఆరా తీ శారు. అలాగే లక్ష్మీ నర్సుపేట గ్రా మంలో గల కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే పరిశీ లించారు. ఉపాధ్యా యులు, బోధనేతర సిబ్బంది పనితీర్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని హె చ్చరించారు. నిల్వ వున్న కూరగాయలు, పెరు గుకు బదులు మజ్జిగ పెడుతుండడాన్ని గుర్తించి సిబ్బందితోపాటు వంట ఏజెన్సీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం తరం భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. తహసీల్దార్‌ జె.ఈశ్వరమ్మ, ఎంిపీడీవో పి.శ్రీనివాసరావు, ఏపీవో శ్రీదేవి, ఎంఈవోలు సీహెచ్‌ మణికుమార్‌, కె.చం ద్రమౌళి, టీడీపీ నాయకులు ఎం.మోహనరావు, కె.చిరంజీవి, ఎ.పోలినాయుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 11:49 PM