Share News

తేలినీలాపురంలో నీటి వనరులు అవసరం: జేసీ

ABN , Publish Date - Sep 12 , 2026 | 12:02 AM

తేలి నీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రం సమీపంలో నీటి వనరులు పెంచాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు.

 తేలినీలాపురంలో నీటి వనరులు అవసరం: జేసీ
నీటి వనరులను పరిశీలిస్తున్న అధికారులు

టెక్కలి రూరల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్ర జ్యోతి): తేలి నీలాపురం విదేశీ పక్షుల విడిది కేంద్రం సమీపంలో నీటి వనరులు పెంచాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. శుక్రవారం ల్యాండ్‌ స్కేప్‌ బృందంతో తేలినీలాపురంలో పర్యటించారు. పర్యావరణ పునరుద్ధరణ, వాటర్‌ పెడ్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయానికి నీటి లభ్యత పెంచాలన్నారు. ఈ పర్యటనలో ల్యాండ్‌స్కేప్‌ ప్రాజెక్ట్‌ అధికారులు సత్యం శర్మ, ఎస్‌పీఎం బాజా, సునీత రోజిలి, డీఎఫ్‌వో బి.వెంకటేష్‌, డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీవో రేణుక పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2026 | 12:02 AM