Share News

ప్రమాణాలు పాటించని వాటర్‌ప్లాంట్‌ సీజ్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:47 PM

నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పా టించని కాజీపేట సచివాలయం పరిధిలో ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌ను నగరపాలకసంస్థ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు.

ప్రమాణాలు పాటించని వాటర్‌ప్లాంట్‌ సీజ్‌
వాటర్‌ ప్లాంట్‌ను సీజ్‌ చేస్తున్న సిబ్బంది

శ్రీకాకుళం అర్బన్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పా టించని కాజీపేట సచివాలయం పరిధిలో ఉన్న ఓ వాటర్‌ ప్లాంట్‌ను నగరపాలకసంస్థ అధికారులు బుధవారం సీజ్‌ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కార్పొరేషన్‌ అధికారులు తాగునీటి తయారీ, సర ఫరా కేంద్రాలపై ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ జి.శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. అన్ని వాటర్‌ ప్లాంట్లు నాణ్యత, పారిశుధ్య ప్రమాణాలు పాటిం చి ట్రేడ్‌ అను మతులు పొందాలన్నారు. నిబం ధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పి.సుధీర్‌కుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 11:47 PM