భగీరథుని స్ఫూర్తితో జలసంరక్షణ
ABN , Publish Date - Apr 24 , 2026 | 12:27 AM
భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణ చేపడదామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ అన్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణ చేపడదామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ అన్నారు. భగీరథ మహర్షి జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివి నుంచి భువికి గంగను తీసుకువచ్చిన భగీరథుని ప్రయత్నం సకల మానవాళికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్ర మంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.