ఉప్పుటేరు కబ్జా స్థలంలో హెచ్చరిక బోర్డు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:19 AM
ఉ ప్పటేరు కాలువ కబ్జాపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
వజ్రపుకొత్తూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ఉ ప్పటేరు కాలువ కబ్జాపై మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ బీవీ సీతారామయ్య ఆధ్వర్యంలో కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. మండల సర్వేయర్ డంబూరు పాత్రోతో కలిసి కబ్జాకు గురైన ఉప్పుటేరు చెరువు ప్రాంతాన్ని సర్వే చేయించారు. ఆక్రమణ జరి గిన ప్రదేశాన్ని గుర్తించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ స్థలం అని ఆక్రమణ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ బోర్డును ఏర్పాటు చేశారు. వీరితోపాటు డీటీ శ్రావణ్‌కుమార్, ఆర్‌ఐ మనోహర్, వీఆర్వోలు వసంతరావు, ప్రసాదరావు ఉన్నారు.