Share News

గోడలు బీటలు వారి.. శ్లాబు పెచ్చులూడి

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:30 AM

పాతపట్నంలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు గోడలు బీటలువారి, శ్లాబు పెచ్చు లూడుతుండడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనాలు కనీస మరమ్మతులకు సైతం నోచుకోక పోవడంతో వర్షాలకు కారిపోతున్నాయి.

గోడలు బీటలు వారి.. శ్లాబు పెచ్చులూడి
మరమ్మతులకు నోచుకోని ఎస్‌ఆర్‌వో కార్యాలయం

పాతపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పాతపట్నంలోని సబ్‌ రిజిస్ట్రేషన్‌, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు గోడలు బీటలువారి, శ్లాబు పెచ్చు లూడుతుండడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనాలు కనీస మరమ్మతులకు సైతం నోచుకోక పోవడంతో వర్షాలకు కారిపోతున్నాయి.

పాతపట్నంలోతొలి పార్లమెంట్‌ సభ్యుడు దివంగత వీవీగిరి హయాంలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించారు. ఈ కాంప్లెక్స్‌లోనే జూనియర్‌ సివిల్‌ జడ్జికోర్టు, పోలీస్‌స్టేషన్‌, సర్కిల్‌, ఇరిగేషన్‌, తహసీల్దార్‌, సబ్‌రిజిస్ట్రే్ట్రషన్‌, సబ్‌ట్రజరీ, సబ్‌జైల్‌ కార్యాలయం తదితర కార్యాలయాలు నిర్వహించేవారు. దీర్ఘకాలంగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఆయా కార్యాలయాల నిర్వహణకు అసౌకర్యం కలగడంతో ప్రభుత్వదృష్టికి తీసు కువెళ్లి నూతన కార్యాలయాల భవన నిర్మాణాలు చేపట్టి సొంత కార్యాల యాలకు తరలించారు. అయితే ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రేషన్‌, సబ్‌ట్రెజరీ కార్యాలయాలు మాత్రమే ఇక్కడ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల రూపంలో ప్రభుత్వానికి ఏటా కోట్లాదిరూపాయల ఆదాయాన్నిచ్చే ఎస్‌ఆర్‌వో కార్యాలయం, ప్రభుత్వ ఆర్థిక లావాలదేవీలను నిర్వహించే ఎస్టీవో కార్యాలయం శిథిలావస్థకు చేరాయి. తమ రెండు శాఖలకు సొంత కార్యాలయాలు నిర్మించకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీర్ఘకాలంగా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతోపాటు మరమ్మతులకు నోచుకోకపోవడంతో చిన్నపాటి వర్షానికి కారిపోతుండడంతో సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఈనేపథ్యంలో ఉన్నతా ధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించి నూతన కార్యాలయాలు నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 12:30 AM