Share News

మూడేళ్లుగా ఎదురుచూపు

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:12 AM

మూడేళ్లయినా పింఛన్‌ మంజూరు కాకపోవడంతో ఎదురు చూసిన ఆమెకు ఎట్టకే లకు మంజూరు కావడంతో భావోద్వేగానికి గు రైంది. రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పింఛన్‌ అందిస్తుండగా కన్నీటి పర్యంతమైన ఘటన శుక్రవారం సంభవించింది. మునిసి పల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌ లబ్ధిదారులకు పింఛ న్లను పంపిణీ చేశారు.

మూడేళ్లుగా ఎదురుచూపు
పింఛన్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌

పింఛన్‌ మంజూరుతో భావోద్వేగం

ధర్మాన సోదరులకు కనువిప్పు కలగాలి: రవికుమార్‌

ఆమదాలవలస, సెప్టెం బరు 4 (ఆంధ్రజ్యోతి): మూడేళ్లయినా పింఛన్‌ మంజూరు కాకపోవడంతో ఎదురు చూసిన ఆమెకు ఎట్టకే లకు మంజూరు కావడంతో భావోద్వేగానికి గు రైంది. రాష్ట్ర పీయూసీ చైర్మన్‌, ఎమ్మెల్యే కూన రవికుమార్‌ పింఛన్‌ అందిస్తుండగా కన్నీటి పర్యంతమైన ఘటన శుక్రవారం సంభవించింది. మునిసి పల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌ లబ్ధిదారులకు పింఛ న్లను పంపిణీ చేశారు. పొందూరు మండలం దల్లిపేటకు చెందిన దల్లి అంకమ్మ భర్త పైడియ్య మూడేళ్ల కిందట మృతి చెందగా పింఛన్‌ రాలేదు. ఇటీవల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే రవికుమార్‌ దృష్టికి తన సమస్యను తీసుకువెళ్లింది. దీంతో ఆయన చొరవ తీసుకుని పింఛన్‌ మంజూరు చేయిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలతో కాలయాపన చేసిన ధర్మాన సోదరులకు ఈ ఘటన కనువిప్పు కలిగించాలన్నారు. వైసీపీ పాలనలో భర్త ను కోల్పోయిన మహిళలకు పింఛన్లు మంజూరు చేశామని, అయితే వైసీపీ జడ్పీటీసీలు జడ్పీ సమా వేశంలో చేసిన ప్రచారం అవాస్తవమమని ఈ ఘటనతో తేలిందన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండ లాలు, మున్సిపాలిటీ పరిధిలో మంజూరైన వితంతు పింఛన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్‌, రాష్ట్ర ఉపాధ్య క్షురాలు తమ్మినేని సుజాత, రాష్ట్ర కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ టి.చంద్రశేఖర్‌, మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మి నేని గీతా విద్యాసాగర్‌, కమిషనర్‌ టి.రవి, టీడీపీ నాయకు లు నూకరాజు, ఎస్‌.మురళీధర్‌, నాలుగు మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:12 AM