వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:24 PM
ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు క్యాంపస్‌లలో 2017-18 విద్యా సంవత్సరంలో విధుల్లో చేరిన మాకందరికీ వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన
ఎచ్చెర్ల, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఆర్జీయూకేటీ పరిధిలో నాలుగు క్యాంపస్‌లలో 2017-18 విద్యా సంవత్సరంలో విధుల్లో చేరిన మాకందరికీ వేతనాలు పెంచాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో సోమవారం ఆందోళన చేపట్టారు. ఆర్జీయూకేటీ పరిధిలో 200 మంది పనిచేస్తున్నామని, తాము విధుల్లో చేరి న తరువాత ఒకసారి మాత్రమే వేతనాలు పెంచారన్నారు. అంతకుముందు జాయినైన వారికి రెండుసార్లు పెంచారన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. వేతనాల చెల్లింపులో వివక్ష లేకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.