Share News

కార్మికులకు వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:46 PM

: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకు లాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, బకాయి వేతనాలు చెల్లించాలని గురుకులాల కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

  కార్మికులకు వేతనాలు చెల్లించాలి
కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న యూనియన్‌ నాయకులు:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకు లాల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు కనీస వేతనాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, బకాయి వేతనాలు చెల్లించాలని గురుకులాల కాంట్రాక్టు అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శ్రీకాకుళంలోని కలెక్టరేట్‌ వద్ద వారు గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు డి.గణేష్‌, సీతామహాలక్ష్మి , బి.పార్వతి, మంజు, లక్ష్మి, అవి నాష్‌, సురేంద్ర, మోహన్‌, రజనీ, జయంతి, సుబ్బలక్ష్మి, హేమలత పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2026 | 11:46 PM