Share News

వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:26 AM

Anganwadi workers' demands సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వేతనాలు పెంచాలని, మినీసెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని నినాదాలు చేశారు.

వేతనాలు పెంచాలి
ఆర్‌్క్షబీ బంగ్లా రోడ్డులో బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు

మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి

అంగన్‌వాడీ కార్యకర్తల డిమాండ్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. వేతనాలు పెంచాలని, మినీసెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలని నినాదాలు చేశారు. తొలుత ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డులో బైఠాయించి ఆందోళన చేశారు. అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. ‘అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి. పెన్షన్‌, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలుచేయాలి. 2019 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచలేదు. డీఏ కూడా అమలు చేయలేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూచార్జీలు, వేతనాలు పెంచాలి. 1800 మినీ సెంటర్లను ప్రధాన కేంద్రాలుగా మార్చాలి. యాప్‌ల భారం తగ్గించాలి. ఖాళీల్లో అర్హులైన హెల్పర్స్‌కు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలి. ఐదేళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాల’ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఐసీడీఎస్‌ పీడీకి వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్‌.అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షుడు కె.నాగమణి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, సీఐటియు నాయకులు రమణ, అల్లు సత్యనారాయణ, హనుమంతు.ఈశ్వరరావు, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు హైమవతి, చంద్రమౌళి, హేమలత, కాంచన, ఆదిలక్ష్మి, జ్యోతి, అప్పలనరసమ్మ, హేమ, లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 11 , 2026 | 12:26 AM