Share News

ఇంటి స్థలం కావాలంటే వీఆర్వో లంచం అడుగుతున్నాడు.. సార్‌

ABN , Publish Date - May 12 , 2026 | 12:47 AM

ఇంటి స్థలం కావాలంటే వీఆర్వో లంచం అడుగుతున్నడు సార్‌ అంటూ ఓ వ్యక్తి మంత్రి అచ్చెన్నాయుడికి విన్న వించారు.

ఇంటి స్థలం కావాలంటే వీఆర్వో లంచం అడుగుతున్నాడు.. సార్‌
ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • ప్రజాదర్బార్‌లో అచ్చెన్నకు ఓ బాధితుడి మొర

  • స్పందించిన మంత్రి.. వీఆర్వోను తొలగించాలంటూ ఆదేశం

టెక్కలి, మే 11(ఆంధ్రజ్యోతి): ఇంటి స్థలం కావాలంటే వీఆర్వో లంచం అడుగుతున్నడు సార్‌ అంటూ ఓ వ్యక్తి మంత్రి అచ్చెన్నాయుడికి విన్న వించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే ఆ వీఆర్వోను తొలగిం చాలంటూ ఆర్డీవోను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. వందల సంఖ్యలో జనం హాజరై వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. ఈ క్రమంలో మేజర్‌ పంచాయతీ టెక్కలిలోని ఆదీఆంధ్రావీధికి చెందిన బొంతల అప్పన్న తన సమస్యను మంత్రికి విన్నవించుకున్నాడు. తాను నిరుపేదనని ఇంటి స్థలం కావాలని గత 114 రోజులుగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నానని, దీని ఆ వీఆర్వో లంచం అడుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై మంత్రి స్పందించి అప్పన్న సమస్య పరిష్కరించడం తోపాటు తక్షణమే ఆ వీఆర్వోను తొలగించాలని ఆర్డీవో కృష్ణమూర్తిని ఆదేశించారు.

- స్థానిక సర్వమంగళవీధిలో ఒక అధ్యాపకుడు కుళాయికి మోటార్‌ భిగించి తన ఇంటికి నీటిని తరలిస్తున్నాడని, దీంతో ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య ఏర్పడిందని బీజేపీ నాయ కులు బూరె నరేంద్ర, జర్జాన్‌ రామ్‌జీ మంత్రికి వివరించారు.

- కాటాబందలో యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతు న్నాయని, వాటిని తొలగించాలని కోళ్ల లవకుమార్‌, ప్రసాద రావు తదితరులు కోరారు.

- అయోధ్యపురం పంచాయతీ సుఖదేవుపేటలో లోవోల్టేజ్‌ సమస్య ఉందని, ఆ సమస్య పరిష్కరించాలని, శాసనాం పరిధిలో గల గొలుసుకట్టు చెరువులు ఆక్రమణ లకు గురవుతున్నాయని, వాటిని పరిశీలించి తొలగించా లని బగాది హరి కోరారు.

- సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామా నికి చెందిన పరపటి సరోజిని జాబ్‌కార్డు ఇప్పించాలని, భీంపురం గిరిజన గ్రామానికి కొత్తగా బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని కెల్లి శ్రీరాములు వినతి పత్రం అందించారు.

- నందిగాం మండలం గొల్లూరు గ్రామానికి చెందిన గీత కార్మికులకు పాడీ కార్డులు మంజూరు చేయాలని, వీఆర్‌కే పురం ఇనాం భూముల సమస్యలు పరిష్కరిం చాలని కోరారు.

‘అర్హులందరికీ ఇళ్ల స్థలాలు’

సంతబొమ్మాళి, మే 11(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రమైన సంతబొమ్మాళిలో రూ.7.5 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పీహెచ్‌సీలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన ఆయుష్‌ ఆసుపత్రిలో ఆధునిక ల్యాబ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ఇళ్లలేని నిరుపేద ఉండకూడదన్నిది ముఖ్యమంత్రి చం ద్రబాబు లక్ష్యమని, ఇందులో భాగంగా ఇటీవల జరి గిన మంత్రివర్గ సమావేశంలో నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గ్రామాల పరిధిలో మూడు సెంట్లు, పట్టణాల పరిదిలో రెండు సెంట్లు చొప్పున్న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయ డం జరుగుతుందన్నారు. డీపీఎన్‌ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరయ్యావని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. సంతబొమ్మాళిలో ఇం టింటి కుళాయి సౌకర్యం ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉన్న ట్టు తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. మూలపేట పోర్టు పూర్తయితే దానికి అనుబంధంగా పరిశ్రమలు వస్తాయని ఇక్కడ యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సంతబొమ్మాలిలో 32మందికి నిరుపేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణ మూర్తి, పీఏయస్‌ చైర్మన్‌ కూశెట్టి కాంతారావు, మార్కె ట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాడాన రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షుడు సుగ్గు స్వరూప్‌రెడ్డి, నాయకులు రెడ్డి అప్పన్న, మెండ అప్పారావు, అల్లు రమేష్‌, కూశెట్టి భానుప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 12:48 AM