ఓటుహక్కు వజ్రాయుధం: శంకర్
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:31 PM
: ఓటు హక్కు వజ్రాయుధమని, దీనిని ప్రాథమిక హక్కుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం స్థానిక బాపూజీ కళా మందిరంలో నిర్వహించారు.
గుజరాతీపేట, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఓటు హక్కు వజ్రాయుధమని, దీనిని ప్రాథమిక హక్కుగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఆదివారం స్థానిక బాపూజీ కళా మందిరంలో నిర్వహించారు. అంతకుముందు ఏడురోడ్ల కూడలి నుంచి విద్యార్థులు, అధికారులతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓటు ద్వారా ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వరరావు, టీడీపీ నాయకుడు పీఎంజే బాబు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్రం డీడీ ఉజ్వల్, వైసీపీ, కాంగ్రెస్ నాయకులు శంకరరావు, ఈశ్వరి, జోగినాయుడు పాల్గొన్నారు.