Share News

వైసీపీకి ఓటేస్తే అధోగతి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:35 PM

రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ఐదేళ్ల నిరంకుశ పాలనతో రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వైసీపీకి ఓటేస్తే పట్టణాభివృద్ధి అధోగతి పడుతుందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు.

వైసీపీకి ఓటేస్తే అధోగతి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవికుమార్‌

ఆమదాలవలస, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి):రానున్న మునిసిపల్‌ ఎన్నికల్లో ఐదేళ్ల నిరంకుశ పాలనతో రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వైసీపీకి ఓటేస్తే పట్టణాభివృద్ధి అధోగతి పడుతుందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలో ఆమదాలవలస మునిసిపల్‌ ఎన్నికలపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షించారు. అనంతరం టీడీపీ పట్టణాధ్య క్షుడు సంపతిరావు మురళీధర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రవికుమార్‌ మాట్లాడు తూ మునిసిపల్‌ ఎన్నికల్లో 28 వార్డుల్లో కౌన్సిలర్లతో పాటు చైర్మన్‌ విజయం సాధిం చడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ జిల్లాఅధ్యక్షుడు మొద లవలస రమేష్‌, టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్‌, ఏఎంసీ చైర్మన్‌ పేడాడ రామ్మోహన్‌, రాష్ట్ర బీసీసెల్‌ టీడీపీ కార్యదర్శి బోర గోవిందరావు, పీఏసీ ఎస్‌ అధ్యక్షురాలు శిమ్మమాధవి, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పొట్నూరు రమేష్‌ మాట్లాడుతూ త్వరలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికల్లో కూటమి అఖండ విజ యం సాధించడానికి ప్రతిఒక్కరూ అహర్నిశలు శ్రమించాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తమ్మినేని గీత, కళింగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ తమ్మినేని చంద్రశేఖర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:35 PM