వైసీపీకి ఓటేస్తే ..అరాచకశక్తులు రాజ్యమేలే ప్రమాదం
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:36 AM
వైసీపీ అభ్య ర్థులకు ఓటేస్తే పలాస-కాశీబుగ్గ అభివృద్ధి కుంటు పడుతుందని, అరాచకశక్తులు రాజ్యమేలే ప్రమాద ముందని, ఐదేళ్ల వైసీపీ పాలన, రెండున్నరేళ్ల టీడీపీ పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, చైర్పర్సన్ అభ్యర్థి వజ్జ గంగా భవాని, ఏపీ ట్రేడ్ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు కోరారు.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, చైర్పర్సన్ అభ్యర్థి వజ్జ గంగాభవాని, ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు
పలాస, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ అభ్య ర్థులకు ఓటేస్తే పలాస-కాశీబుగ్గ అభివృద్ధి కుంటు పడుతుందని, అరాచకశక్తులు రాజ్యమేలే ప్రమాద ముందని, ఐదేళ్ల వైసీపీ పాలన, రెండున్నరేళ్ల టీడీపీ పాలనను బేరీజు వేసుకొని ఓటు వేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, చైర్పర్సన్ అభ్యర్థి వజ్జ గంగా భవాని, ఏపీ ట్రేడ్ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు కోరారు. ఈ మేరకు కాశీబుగ్గలో 15, 16, 17, 18, 19 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల వద్దకు నేరుగా వెళ్లి రెండున్నరేళ్లలో రాష్ట్రం, పలాస నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. రైతుబజారు నిర్మా ణం కోసం గత ప్రభుత్వం కేవలం గాలికబుర్లు మాత్రమే చెప్పిందని, కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాగానే రైతుబజారు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతోపాటు రూ.70 లక్షలు నిర్మాణానికి నిధులు సమకూర్చామన్నారు. రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి రూ.50 కోట్ల మేర రైల్వేశాఖ నిధులు తీసుకువచ్చి గడువుకు ముందే పూర్తి చేశామని, కాశీబుగ్గ నుంచి అక్కుపల్లి రహదారిని వైసీపీ విడిచిపెడితే తాము దాన్ని పూర్తి చేసి చూపించామన్నారు. కేవలం తాగు నీటికే రూ.122 కోట్లు మేర నిధులు ఇప్పించామని, ప్రస్తుతం చురుగ్గా పైపులైన్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఎమ్మెల్యే గౌతు శిరీష కృషితో చేసిన అభి వృద్ధిని క్రెడిట్ చోరీ అంటూ విషప్రచారం చేయడం వైసీపీ నాయకులకు తగదని, వారి చేష్టలను ప్రజలు గుర్తించారని తెలిపారు. చైర్మన్తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులందర్ని గెలిపించాలని, రాష్ట్రంలో ఉన్నతమైన మునిసిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుం టామని చెప్పారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో లొడగల కామేశ్వరరావుయాదవ్, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, పీరుకట్ల విఠల్రావు, మల్లా శ్రీనివాస్, ఎం.నరేంద్ర, టీడీపీనాయకులు పాల్గొన్నారు.