న్యాయ సహాయంలో వలంటీర్లే కీలకం
ABN , Publish Date - Sep 02 , 2026 | 12:01 AM
బడుగు, బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించ డంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్య దర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించ డంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్య దర్శి కె.హరిబాబు అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్‌లో మంగళవారం పారా లీగల్ వలంటీర్లకు వివిధ చట్టాలపై శిక్షణ కార క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. న్యాయవ్యవస్థకు ప్రజలకు వారధిలా వలంటీర్లు పనిచేయాలన్నారు. మహిళా సంర క్షణ, బాలల హక్కులు, వయోవృద్ధులు, దివ్యాం గుల చట్టాలు, అత్యా చారాల నిరోధక చట్టాలు, బాధితుల పరిహార పథకాలపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో పలువురు వలం టీర్లు, న్యాయవాదులు, న్యాయసేవాసదన్ సిబ్బం ది పాల్గొన్నారు.