‘విశాఖ రైల్వే జోన్‌లో కలపాలి’
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:21 PM
విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఇచ్ఛాపురం వరకు ఉన్న అన్ని స్టేషన్‌లను కలపాలని జడ్ ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస రౌలో కోరారు.
ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఇచ్ఛాపురం వరకు ఉన్న అన్ని స్టేషన్‌లను కలపాలని జడ్ ఆర్‌యూసీసీ సభ్యుడు శ్రీనివాస రౌలో కోరారు. ఈ మేరకు మంగళవారం పలాసలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో ఇచ్ఛాపురం, జాడుపూడి, సోంపేట, బారువా, మందస, సుమ్మాదేవి, పలాస స్టేషన్‌లు కలిపి నట్లైతే పూర్తిస్థాయిలో స్టేషన్లు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి ఈ ప్రయత్నంలో ఉన్నానని, రైల్వేశాఖ నుంచి సానుకూలమైన ఫలితం వస్తుందని మంత్రి తెలిపారని రౌలో తెలిపారు. కార్యక్రమంలో బుడ్డా మణిచంద్ర ప్రకాష్, పి.సంతోష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.