రోడ్ల నిర్మాణంతో పల్లెలు ప్రగతి బాట
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:09 PM
రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలు ప్రగతి బాటలో పయని స్తాయని పీయూసీ చైర్మన్, ఎమ్మె ల్యే కూన రవికుమార్ అన్నారు.
-ఎమ్మెల్యే రవికుమార్
పొందూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలు ప్రగతి బాటలో పయని స్తాయని పీయూసీ చైర్మన్, ఎమ్మె ల్యే కూన రవికుమార్ అన్నారు. తాడివలసలో రూ.1.94 కోట్లతో నిర్మించిన బీటీ, సీసీ రోడ్లను, మల్లేసుపేటలో సుమారు రూ.50 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును ఆయన బుధవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రోడ్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుం దని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల నిర్మాణం తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో తాడివలస సర్పంచ్ తమ్మినేని మనెమ్మ, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బి.శంకరభాస్కర్, టీడీపీ కార్యదర్శి సీపాన శ్రీరంగ నాయకులు, మండల ఉపాధ్యక్షుడు బాడాన గిరి, పీఏసీఎస్ అధ్యక్షుడు వండాన మురళి, గోరింట సర్పంచ్ చింతాడ వాసుదేవరావు, మండల తెలుగుయువత అధ్యక్షుడు ఖండాపు శ్రీను, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.