Share News

‘స్వచ్ఛరథం’తో పల్లెలు పరిశుభ్రం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:08 AM

స్వచ్ఛరథంతో పల్లెలు పరిశుభ్రంగా ఉంటా యని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదికుదుటి ఈశ్వరరరావు తెలిపారు. గురువారం జి.సిగడాం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛరథాలను ప్రారంభించారు.

 ‘స్వచ్ఛరథం’తో పల్లెలు పరిశుభ్రం
రణస్థలం: ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛరథంతో పల్లెలు పరిశుభ్రంగా ఉంటా యని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నదికుదుటి ఈశ్వరరరావు తెలిపారు. గురువారం జి.సిగడాం మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో స్వచ్ఛరథాలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో మురళి, కుమరాపు రవికుమార్‌, పైల విష్ణుమూర్తి, మీసాల రవికుమార్‌, బాలబొమ్మ వెంకటేష్‌, కుదిరిళ్ల బుజ్జి, వజ్జిపర్తి రఘురాం, బూరాడ వెంకటరమణ పాల్గొన్నారు.

ముస్లింల సంక్షేమానికి కృషి

రణస్థలం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుతం కృషిచేస్తోందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు తెలిపారు. గురువారం రణస్థలం లోని జమియా మసీద్‌లో రంజాన్‌ మాసం పురస్కరించుకుని ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు పాల్గొని ముస్లిం పెద్ద సలీమ్‌బయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు డీజీఎం ఆనందరావు, రౌతు శ్రీనివాసరావు, పిషిని జగన్నాఽథంనాయుడు, ఎం.కనకారావు , షేక్‌ సైదాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:08 AM