గ్రామాలే ఆనందానికి నిలయం
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:56 PM
గ్రామాలే స్వచ్ఛతకు పరిపూర్ణమైన ఆనంద నిలయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు.
ఎమ్మెల్యే గోవిందరావు
పాతపట్నం జనవరి 14(ఆంధ్రజ్యోతి): గ్రామాలే స్వచ్ఛతకు పరిపూర్ణమైన ఆనంద నిలయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మండల పరిధిలోని సీది గ్రామంలో బుధ వారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ వేదికలుగా నిలిచే పర్వదినాలు ఉత్సాహంగా నిర్వహంచుకోవాలన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కూటమి నాయకులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు.