Share News

కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి: అశోక్‌

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:54 PM

గ్రామాల్లో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు.

 కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి: అశోక్‌
కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

కంచిలి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అన్నారు. సిర్తలిలో రూ.7.5 లక్షల ఎంపీల్యాడ్స్‌ నిధులతో, డీజీ పురంలో రూ.7.5లక్షలతో సామాజిక భవనాల నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో పారిశుధ్య మెరు గుకు మంజూరు చేసిన స్వచ్ఛరథాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పనతో పాటు ఇతర మౌలిక సౌకర్యాల కల్పిం చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జె.బైరిపురంలో నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు పైల పురుషోత్తం రెడ్డి, టీడీపీ నాయ కులు మాదిన రామారావు, పైల రామారావు, జగదీష్‌ పట్నాయక్‌, బంగారు కురయ్య, ఎంపీడీవో వి.తిరుమలరావు, పీపఆర్‌ ఏఈ ప్రవీణ్‌, ఏపీవో ధనుంజయ, ఎస్‌ఐ పి.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:54 PM