గ్రామాల అభివృద్ధే లక్ష్యం: ఎంపీ, ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:52 PM
గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు.
రణస్థలం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు అన్నారు. ఆదివారం మండ లంలో రూ.11.19 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రా రంభించారు. వివిధ గ్రామాలకు వేసిన సీసీ, బీటీ రోడ్లను ప్రారంభిం చారు. పిన్నింటిపేటకు వేసిన సీసీ రోడ్డు, భద్రమహం కాళి గుడి వద్ద నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రహ దారులు వేయడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోం దన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు, కూటమి నేత లు దెయ్యం శ్రీనివాసరావు, పిషిని జగన్నాథం నాయుడు, దన్నాన సత్తిబాబు, దన్నాన స్వామి నాయుడు, దన్నాన మహేష్, కనకారావు తదిత రులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
రణస్థలం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): నిరు పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఒక వరమని ఎంపీ కలి శెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు తన కార్యాలయంలో ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్య అవస రాలకు, ఆపద సమయంలో బాధిత కుటుంబా లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.