రోడ్ల నిర్మాణంతోనే గ్రామాల అభివృద్ధి: శంకర్
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:59 PM
రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి సాధి స్తాయని, ఇదే ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతున్నా మని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
శ్రీకాకుళం అర్బన్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రోడ్ల నిర్మాణంతోనే గ్రామాలు అభివృద్ధి సాధి స్తాయని, ఇదే ఉద్దేశంతో నిర్మాణాలు చేపడుతున్నా మని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కుందు వానిపేటలో సోమవారం పలు అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. కుందువానిపేట, పీజీపేట, బలరాంపురం గ్రామాల మధ్య రాకపోకలకు అను వుగా ఉండేలా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. మత్స్యకార గ్రామాల సర్వతోముఖా భివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
యూనిఫారాలు పంపిణీ
మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలు, ఓబీలు సుమారు 200 మందికి ఎమ్మెల్యే గొండు శంకర్ యూనిఫారాలు పంపిణీ చేశారు. మహిళా సాధికారికతకు ప్రాధాన్యమిస్తూ గౌరవ వేతనం పెంపు సమస్యను సీఎం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీనిచ్చారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలు నవంబరు నెలాఖరులోగా జరిగే అవకాశం ఉందన్నారు. అన్ని డివిజన్లలో విజయం సాధిస్తామన్నారు.