Share News

సందడిగా గ్రామదేవతల సంబరాలు

ABN , Publish Date - Jul 19 , 2026 | 11:47 PM

జిల్లాలో పలుచోట్ల ఆదివారం గ్రామదేవతల సంబరాలు సందడిగా నిర్వహించా రు.ఈసందర్భంగా ఉత్సవకమిటీల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

 సందడిగా గ్రామదేవతల సంబరాలు
నందిగాం: కొత్తమ్మతల్లికి మొక్కులు చెల్లించేందుకు వెళ్తున్న మహిళలు

జిల్లాలో పలుచోట్ల ఆదివారం గ్రామదేవతల సంబరాలు సందడిగా నిర్వహించా రు.ఈసందర్భంగా ఉత్సవకమిటీల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.

నందిగాం, జూలై 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని జల్లపల్లిలో కొత్తమ్మతల్లి గ్రామదేవత సంబరం ఆదివారం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా ఆషాడమాసంలో పౌర్ణమి ముందు ఆదివారం ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మేళతాళాలు, ఆటపాటలు మఽధ్య మహిళ లు ముర్రాటలతో వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి చల్లదనం చేసి మొక్కులు చెల్లించారు. గ్రామదేవతల సంబరాల్లో భాగంగా బంధువులు, దూరప్రాంతాల్లోఉన్న స్థానికులు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.

నరేంద్రపురంలో రెయ్యిబోడమ్మ...

నందిగాం మండలంలోని నరేంద్రపురంలో రెయ్యిబోడమ్మ, భూలోకమాత గ్రామ దేవతల సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. గ్రామస్థులు, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఊరే గింపుగా మహిళలు తరలివెళ్లి దేవర్లను తీసుకురావడంతో గ్రామంలో పండగ వాతా వరణం నెలకొంది. మూడురోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో భాగంగా తొలిరోజు కోలాటం, మేళతాళాలు, బాణసంచాలతో పురవీధుల్లో సందడి నెలకొంది. పలు కూడళ్లలో ఏర్పాటుచేసిన దేవతామూర్తులు ఆకట్టుకున్నాయి. మంగళవారం నిర్వ హించి అంజలిరథ ఊరేగింపుతో ఉత్సవాలు ముగియనున్నాయి.

నౌపడలో బల్లోల..

సంతబొమ్మాళి, జూలై19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నౌపడ, సీతానగరంల్లోని పాలపోలమ్మ,(బల్లోల సంబరాలు) తోటపోలమ్మ అమ్మవార్ల సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం పగటివేషాలు ప్రదర్శించడంతోపాటు ఊరేగించారు. రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - Jul 19 , 2026 | 11:47 PM