‘రేపటి నుంచి విజయదుర్గమ్మ ప్రతిష్ఠోత్సవాలు’
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:25 PM
నగరంలోని నానుబాల వీధిలో వెలసిన విజయదుర్గ అమ్మవారి దేవాలయ పునః ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తు న్నట్లు ప్రధానా ర్చకుడు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ తెలిపారు.
అరసవల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): నగరంలోని నానుబాల వీధిలో వెలసిన విజయదుర్గ అమ్మవారి దేవాలయ పునః ప్రారంభం, విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు శుక్రవారం నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తు న్నట్లు ప్రధానా ర్చకుడు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ తెలిపారు. బుధవారం ఆలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ.. 5వ తేదీ సాయంత్రం చిన్నబజారు రోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద నుంచి అమ్మ వారి శోభాయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 6, 7 తేదీల్లో ఉదయం 6.50 నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, ప్రతిష్ఠా సంకల్పంతో కార్యక్రమాలు ప్రారంభమవు తాయన్నారు. అమ్మవారికి పంచశయ్యాధివాసాలు, అర్చన, కళాది హోమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉదయం 10.40 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, సాయంత్రం మహా కుంభాభిషేకం, హోమాలు చేపడుతున్నామన్నారు. 10న ఉదయం 9.30 గంటలకు శిఖరానికి 1008 అష్ట మూలికా జలాలతో అభిషేకం చేస్తామన్నారు. 12న మధ్యాహ్నం అన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తరించాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు ఆరవెల్లి ఫణికుమార్ శర్మ, చంద్రశేఖర శర్మ, నీరజా సుబ్రహ్మణ్యం, మంగళంపల్లి వరలక్ష్మి, కిల్లంశెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.