అక్రమ రవాణాపై విజిలెన్స్ నిఘా
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:27 PM
రేషన్ బియ్యం, ఎరువుల అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు.
హిరమండలం, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): రేషన్ బియ్యం, ఎరువుల అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు నిఘా పెట్టారు. శనివారం మండలంలో పలు చోట్ల లారీలు, ఆటోలు, ఇతర వాహనాలను తనిఖీ చేశారు. తురకపేట గ్రామా నికి చెందిన గెంబలి శ్రీనివాసరావు రూ.43,225 విలువ చేసే 9.50 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఒడిశా రాష్ట్రం సీతపురానికి వ్యాన్‌లో తరలిస్తుండగా విజిలెన్స్ ఎస్‌ఐ బి.రామారావు, సిబ్బంది పట్టుకున్నారు. నివగాం గ్రామానికి చెందిన నాగరాజు హడ్డుబంగిలోని వట్టి సింహాచలం కిరాణా దుకాణం నుంచి బొలోరో వాహనంలో రూ.1,30,527 విలువ చేసే 60 యూరియా బస్తాలను తరలిస్తుం డగా పట్టుకున్నారు. ఈ యూరియా బస్తాలు ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన పిసిని రామకృష్ణకు పంపిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. రేషన్ బియ్యం, యూరియా స్వాధీనం చేసుకొని రెండు వాహనాలను సీజ్‌చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో వ్యవసాయ అధికారి సంధ్య,సివిల్ సప్లయి డీటీ సీహెచ్ భీమారావు పాల్గొన్నారు.