Share News

కొబ్బరికి ఆశించే తెగుళ్లపై అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:35 PM

కొబ్బరి పంటకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమ త్తంగా ఉండాలని ఆమ దాలవలస కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త హరికుమార్‌ అన్నా రు. బొర్రపుట్టుగ గ్రామంలో మంగళవారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు.

కొబ్బరికి ఆశించే తెగుళ్లపై అప్రమత్తత అవసరం
కవిటి: రైతులకు సర్టిఫికెట్లను అందిస్తున్న అధికారులు

కేవీకే శాస్త్రవేత్త హరికుమార్‌

కవిటి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): కొబ్బరి పంటకు ఆశించే తెగుళ్లపై రైతులు అప్రమ త్తంగా ఉండాలని ఆమ దాలవలస కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త హరికుమార్‌ అన్నా రు. బొర్రపుట్టుగ గ్రామంలో మంగళవారం రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కొబ్బరికి ఎర్రముక్కు, నల్ల ముట్టెపు రుగు సోకితే వాటి నివారణకు క్లోరిపైరిఫాస్‌ మందుతో పాటు నాఫ్తలిన్‌ బాల్స్‌, ఫెర్‌టోరా గుళికలను వాడాలన్నారు. వేపపిండిలో ఇసుకను కలిపి వాడాల న్నారు. రైతులంతా సామూహికంగా బకెట్‌ ట్రాప్స్‌ను వాడడం వల్ల పురుగులను నివారించవచ్చన్నారు. అనం తరం శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్లను అందిం చారు. కార్యక్రమంలో రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్‌, ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరె క్టర్‌ ఎం.రవికృష్ణ, ఇన్‌చార్జి ఉద్యాన వనశాఖాధికారి పి.మాధవీలత వివిధ అంశాలను వివరించారు.

ఉద్యాన పంటల రైతులకు సూచనలు..

రణస్థలం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కొబ్బరి, ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండా లని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త అనూష సూచిం చారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల కొబ్బరిలో పూత, కొబ్బరి కాయలు రాలడం, ఆకులు పసుపు రంగుకు మారడం జరుగుతోందని, ఒక కొబ్బరి చెట్టుకు 50 లీటర్ల నీరు ప్రతి రోజు ఉదయం, సాయం త్రం పెట్టాలని సూచించారు. ఏడాదికి ఒక చెట్టుకు 1 కేజీ యూరియా, 2 కేజీ ఎస్‌ఎస్‌పీ, 1 కేజీ ఎంవోపీ రెండు దఫాలు ఇవ్వాలని సూచించారు. ఉద్యాన శాఖాధికారి టి.అమరేశ్వరి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2026 | 11:35 PM