Share News

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం

ABN , Publish Date - Jul 31 , 2026 | 12:37 AM

మానవ అక్రమ రవాణా జరగ కుండా అప్రమత్తంగా ఉండాలని మండల సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నా రు.

మానవ అక్రమ రవాణాపై అప్రమత్తత అవసరం
సోంపేట: మాట్లాడుతున్న జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కిశోర్‌బాబు

జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కిశోర్‌బాబు

సోంపేట, జూలై 30 (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా జరగ కుండా అప్రమత్తంగా ఉండాలని మండల సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ఆరో అదనపు న్యాయాధికారి కోడూరు కిశోర్‌బాబు అన్నా రు. మం డల పరిషత్‌ కార్యాలయంలో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ రవాణా అనేది ఎక్కువగా మహిళల విషయంలోనే జరుగు తుందని, అందువల్ల వారు ధైర్యంగా దీనిని ఎదుర్కోవాలన్నారు. అలాగే సైబర్‌ క్రైం ద్వారా ఆధునిక పద్ధతుల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ బి.మంగరాజు, ఎంపీడీవో సీహెచ్‌ ఈశ్వరమ్మ, న్యాయవాదులు జీఎస్‌ శైలీంద్ర, ఎం.సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అవగాహనతోనే అక్రమ రవాణా నియంత్రణ

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు

ఎచ్చెర్ల, జూలై 30(ఆంధ్రజ్యోతి): సరైన అవగాహనతోనే మానవ అక్ర మ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గురువారం ప్రపం చ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డి.మత్స్య లేశంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఉద్యోగాలు, వివాహాల పేరిట జరిగే మోసాలు, వెట్టి చాకిరీని ఎదుర్కొనే చట్టాలను వివరించారు. అక్రమ రవాణాకు గురవు తున్న మహిళలు, చిన్నారులు, నిరుపేదలను కాపాడేందుకు తీసుకునే చట్టాలపై అవగాహన కల్పించారు. బాధితులు టోల్‌ ఫ్రీ నెంబరు 15100 కు ఫోన్‌ చేసి సహాయం పొందాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ యు.శ్రీలక్ష్మి, జిల్లా శిశు సంరక్షణాధికారి రమణ, న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్‌, ఎఫ్‌డీవో కె.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2026 | 12:37 AM