కార్యకర్తల భాగస్వామ్యంతోనే విజయం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:15 AM
కార్యకర్తల భాగస్వామ్యం తోనే స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు వీరేష్ చంద్రదేవ్ అన్నారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులు, మండల టీడీపీ అధ్యక్షులు, టీడీపీ శ్రేణులతో శనివారం కత్తెరవానిపేట క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పోలాకి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తల భాగస్వామ్యం తోనే స్థానిక ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, నియోజకవర్గ పరిశీలకుడు వీరేష్ చంద్రదేవ్ అన్నారు. నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మండలాల క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జులు, మండల టీడీపీ అధ్యక్షులు, టీడీపీ శ్రేణులతో శనివారం కత్తెరవానిపేట క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో కి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రామస్ధాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.