పశ్చిమ బెంగాల్‌లో గెలుపు దేశాభివృద్ధికి దోహదం
ABN , Publish Date - May 06 , 2026 | 11:45 PM
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
రణస్థలం, మే 6 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం దేశాభివృద్ధికి దోహదపడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఎచ్చెర్ల బీఎల్‌ఏ-1 నడుకుదిటి తేజాబాబు ఆధ్వర్యంలో ఎన్‌ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అధ్యక్షతన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవ్ పాల్గొ న్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఈ విజయంతో ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందన్నారు. ఐదు రాష్ట్రా ల్లో జరిగిన ఎన్నికలల్లో పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాలో బీజేపీ విజయదుందుభి మోగించిందని, మోదీ పాలనలో దేశ భద్రతపై ఉన్న నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నారు. భారతదేశాన్ని ప్రపంచలోనే అగ్రరాజ్యంగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా ప్రధాని కృషి చేస్తున్నారన్నారు. భోగాపురం విమానా శ్రయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయ న్నారు.
తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస కాలువ పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తాన న్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరి పురపు తేజేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు పైడి వేణుగోపాలరావు, నేతలు ప్రకాష్ రెడ్డి, విజయానందరెడ్డి, టీడీపీ నాయకులు లంక శ్యామలరావు, ముప్పిడి సురేష్, కొమరాపు రవి, బెండు మల్లేశ్వరరావు, డీజీఎం ఆనందరావు, పిషిని జగన్నాఽథం నాయుడు, జనసేన నాయ కుడు విష్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు.