Share News

మూడు పార్టీల సమన్వయంతో ఎన్నికల్లో విజయం

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:36 AM

మూడు పార్టీల సమన్వయంతోనే రణస్థలం, ఎచ్చెర్ల,లావేరు, జి.సిగడాం మం డలాల ఎంపీపీలు, జడ్పీటీసీ అభ్యర్థులు ఎనికల్లో విజయం సాధించారని ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు తెలిపారు.

 మూడు పార్టీల సమన్వయంతో ఎన్నికల్లో విజయం
మాట్లాడుతున్న లంక శ్యామలరావు :

రణస్థలం, నవంబరు 26 (ఆంధ్రజ్యో తి): మూడు పార్టీల సమన్వయంతోనే రణస్థలం, ఎచ్చెర్ల,లావేరు, జి.సిగడాం మం డలాల ఎంపీపీలు, జడ్పీటీసీ అభ్యర్థులు ఎనికల్లో విజయం సాధించారని ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి లంక శ్యామలరావు తెలిపారు.గురువారం రణ స్థలంలోని క్యాంపుకార్యాలయంలో శ్యామ లరావు విలేకరులతో మాట్లాడారు. ఎంపీ టీసీ జగన్నాఽథంనాయుడుకు కూటమి అన్యాయం చేయలేదని, కూటమి ధర్మం ప్రకారం మొదటి విడత లంక ప్రభాకర్‌, రెండో విడత పిషిని జగన్నాథంనాయుడు ఎంపీపీగా కొనసాగాలని తీర్మానించినట్లు తెలిపారు. జగన్నాథంనాయుడు సీనియర్‌ టీడీపీ నాయకుడుగా ఆయనకు గౌరవం పార్టీలో ఉందని చెప్పారు. నాలుగు మం డలాల్లో కూటమి విజయదుంధబి మోగిం చేందుకు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రధానభూమిక వహించారన్నారు.కార్యక్ర మంలోఎంపీపీ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:37 AM