Share News

ఎన్నికలలో విజయమే లక్ష్యం కావాలి

ABN , Publish Date - Oct 17 , 2026 | 12:21 AM

స్థానిక ఎన్నికలలో విజయమే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శ్రేణులకు సూచించారు.

ఎన్నికలలో విజయమే లక్ష్యం కావాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలలో విజయమే లక్ష్యం కావాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శ్రేణులకు సూచించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితోనే ఎన్నికలలో విజయం సాధ్యమవుతుందన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో గ్రామాలలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. విభేదాలకు అవకాశమివ్వవద్దని తెలిపారు. ఈ సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ బండి రవివర్మ, టీడీపీ నేతలు పైల బాబ్జీ, సైలాడ స తీష్‌, ఎ.రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2026 | 12:21 AM